సిర్పూర్ టి: ఇటిక్యాల పహాడ్ గ్రామ శివారులో బోరు బావి నుండి విరజింపుతున్న నీళ్లు, ఆశ్చర్యపోతున్న స్థానిక ప్రజలు
సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామ శివారులో గల ఓ బోరు బావి నుండి నీళ్లు విరజిమ్ముతున్నాయి. బోరు బావికి గల కేసింగ్ పైపులో నుండి నీళ్లు భారీగా విరజింపడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బోరుకు కరెంట్ మోటర్ ఆన్ చేయకుండానే నీళ్లు వస్తున్న నేపథ్యంలో ఆ బోరు బావిని చూసేందుకు ప్రజలు తరలి వెళ్తున్నారు,