రాజేంద్రనగర్: గర్విపల్లికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
తలకొండపల్లి మండలం గర్విపల్లికి చెందిన వసుపుల మల్లేశ్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడు ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 18న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.