కొత్తూర్: కొత్తూరు మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని మక్తగూడ, మల్లాపూర్, కోడిచేర్ల, తీగాపూర్, సిద్దాపూర్ తదితర గ్రామాలలో బుధవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమైన విషయమని ప్రతి కార్యకర్త, నాయకులు గ్రహించాలని సూచించారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు.