రాజేంద్రనగర్: ఉగ్రవాదానికి సంబంధించి రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు
ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.