డోన్: బేతంచర్లకు చేరుకున్న విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు
Dhone, Nandyal | Jun 6, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు మండల కేంద్రానికి చేరుకున్నాయని ఎంఈవో అబ్రహం సోమశేఖర్ తెలిపారు. మండల అవసరాలకు అనుగుణంగా 39,527 పాఠ్యపుస్తకాలు, 47,645 నోటు పుస్తకాలు అందినట్లు వెల్లడించారు. వీటితో పాటు విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున మొత్తం 7,015 యూనిఫాంలో అందాయని తెలిపారు