రాజేంద్రనగర్: వనస్థలిపురం కు చెందిన ముగ్గురికి ఫైన్ విధించిన హయత్ నగర్ కోర్టు
ఓ ప్లాట్ గోడ విషయంలో ముగ్గురికి హయత్‌నగర్ కోర్టు ఫైన్ విధించింది. వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన వరద లక్ష్మణ్ (37) గౌడ్, సాహెబ్ నగర్‌కు చెందిన వరద కృష్ణ గౌడ్ (38), వరద విష్ణు (55) ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఈరోజు జరిమానా విధించింది. వనస్థలిపురం PS పరిధిలో గతంలో గొడవ జరిగింది. కేసు ట్రయల్‌కు వచ్చిన వేళ నెల రోజుల్లో ఫైన్ చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.