సిర్పూర్ టి: ఎస్ పి ఎం పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణ ప్రజలు, కాలుష్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన
కాగజ్నగర్ పట్టణంలోని ఎస్ పి ఎం కంపెనీ కాలుష్యంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వాకింగ్ కోసం వెళ్ళిన వారు కంపెనీ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కాలుష్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య నియంత్రణపై అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు,