శంకరంపేట ఏ: నిజాంసాగర్ మండలంలో దంచి కొట్టిన వర్షం
నిజాంసాగర్ మండలంలో వర్షం దంచి కొడుతుంది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొట్టింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా రోడ్లపై నీళ్ళు ఏరులై పారాయి. కాలనీలు వరద నీటితో మునిగిపోగా కొన్ని ప్రాంతాల్లో వరద నీళ్ళు ఇండ్లలోకి చేరాయి. వర్షం ధాటికి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.