సంగారెడ్డి: సంగారెడ్డి లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం, పాల్గొని మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి పట్టణంలో ప్రజా పాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించి మాట్లాడారు. ప్రభుత్వం నిరంకుశ రాచరిక పాలన చరమగీతం పాడి ప్రజా పాలన వైపు పయనిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రావిణ్య ఆఫీసర్లు పాల్గొన్నారు.