రాజమండ్రి సిటీ: ఒకేసారి దేశంలో ఎన్నికలు నిర్వహించాలని వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఉద్దేశం : రాజమండ్రిలో ఎంపీ పురందేశ్వరి
రాజమండ్రిలో ఆదివారం జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సుకు మాజీ కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె న్యూఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయని తెలియజేశారు . ఇతర పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రధాన ఉద్దేశమని ఆమె అన్నారు.