బస్సు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు అనంతపురం ఆసుపత్రికి తరలింపు
Anantapur Urban, Anantapur | Apr 19, 2026
అనంతపురం జిల్లా రాయదుర్గం బస్టాండులో బస్సు ఢీకొని కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కళ్యాణదుర్గం మండలం కోనాపురం గ్రామానికి చెందిన మల్లప్ప అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధుడిని అనంతపురం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.