పుంగనూరు: పట్టణంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు. ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ముస్లిం వర్గాల ఆధ్వర్యంలో స్థానిక కుమ్మరి వీధి, రాతి మసీదు, నుంచి ముడెప్ప సర్కిల్ వరకు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన హజరత్ టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలై జయంతి వేడుకల ర్యాలీ. టపాకాయలు పేల్చుతూ మిఠాయిలు పంచుతూ అంగరంగ వైభవంగా ర్యాలీ ప్రారంభించారు. టిప్పు సుల్తాన్ ర్యాలీ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలమనే డిఎస్పి డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో. సిఐ సుబ్బారాయుడు, పర్యవేక్షణలో ఎస్ఐలు హరిప్రసాద్, కె.వి రమణ, పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.