డోన్: రంగాపురంలో డెంగీ వ్యాధిపై అవగాహన ర్యాలీ
Dhone, Nandyal | May 16, 2026 డెంగీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం పీహెచ్సీ వైద్యులు డా.అబ్దుల్ అలీం, డా.మూర్తుజా వలి అన్నారు. శనివారం జాతీయ డెంగు దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల నీటి నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ, మెదడువాపు వ్యాధి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిపారు