మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండలంలోని ఉంద్యాల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల కురుమన్న కూతురు అనుషిత(11) ఇంటి బయట బాల్కనీకి చీరతో కట్టిన ఊయలతో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు ఊయలకు కట్టిన చీర పాప గొంతుకు బిగుసుకుంది. కొంతసేపటి తర్వాత గుర్తించిన తల్లి శైలజ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.