కేసముద్రం: పాటు సారా కేసులో బైండవర్ నిబంధనలు ఉల్లంగించిన ఇద్దరు మహిళలకు, లక్ష రూపాయల జరిమానా విధించిన కేసముద్రం తహసిల్దార్
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరికీ,లక్ష రూపాయల జరిమానా విధించారు కేసముద్రం తహసిల్దార్ దామోదర్. గతంలో నాటుసారాయి అమ్ముతూ పట్టుబడిన కేసులో కేసముద్రం మండలం గిర్ని తండాకు చెందిన బానోతు పద్మ మరియు అమీనాపూర్ గ్రామానికి చెందిన ఆంగోతు జ్యోతిలు తహసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయగా, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి సారా వ్యాపారం చేస్తుండగా, పట్టుకొని ఎక్సైజ్ అధికారులు ఈరోజు తహసిల్దార్ ముందు ప్రవేశపెట్టగా, ఇద్దరు మహిళలకు చెరువు 50,000 చొప్పున లక్ష రూపాయలు జరిమానా విధించారు .ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై శ్రీమతి శీలం రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.