పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ముట్టడికి YCP పిలుపుమేరకు అనుమతులు లేవంటూ ఎక్కడికి అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గo పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ముట్టడికి వైయస్సార్సీపి పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి పర్మిషన్ లేదంటూ ఎవరిని పోలీసులు అనుమతించడంలేదు.ఈరోజు హైదరాబాద్ నుంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న వైయస్సార్సీపి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఆంధ్ర తెలంగాణ పొందుగల అంతర్ రాష్ట్ర బోర్డర్ వద్ద అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు.