ఒంగోలు అర్బన్: బి కే క్యాంపు కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహించిన ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Apr 25, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం లో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శనివారం బికే క్యాంపు కార్యాలయం నందు ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గస్థాయిలోని ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను ప్రజావేదికకు హాజరై ఎమ్మెల్యేకు సమర్పించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అజ్జలపై సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు.ప్రజలు వెల్లడించిన ప్రతీ సమస్యను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి పరిష్కరిస్తానని తెలిపారు