నంద్యాల జిల్లాలో మారిన వాతావరణం, పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ
Nandyal Urban, Nandyal | Apr 28, 2026
నంద్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ల ద్వారా హెచ్చరికలు పంపింది. మరోవైపు మహానంది మండలంలో ఈదురుగాలులు మొదలవ్వడంతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వేగానికి పంట దెబ్బతినే అవకాశం ఉందని భయపడుతున్నారు.