అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా బొమ్మలాట పల్లి లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కార్మికుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో నరసప్ప అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.