కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాలతో దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు తనిఖీలు
లైసెన్సులు లేకుండా ఎవరైనా టపాసులు నిల్వ చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో షాపులు, గోడౌన్లలో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలని ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా , అత్యవసర సమయంలో డయల్ 112 గాని , ఫైర్ స్టేషన్ డయల్ 101 కు గాని , డయల్ 100 కు గాని సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు జరిపినా , అక్రమంగా నిల్వ ఉంచినా ఆ సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలిపారు.