డోన్: అక్రమమద్యంపై దృష్టి పెట్టండి ఎక్సైజ్ అధికారులను ఆదేశించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 2, 2026 డోన్ నూతన ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని గురువారం కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, ఎక్సైజ్ శాఖ విధులను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అక్రమ మద్యం నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తానని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.