ఒంగోలు అర్బన్: స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజలో ఉన్న కలెక్టర్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి.
Ongole Urban, Prakasam | May 15, 2026
జిల్లాలో గ్రామస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, పారిlశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ముఖ్యంగా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడంతో కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, కింది స్థాయి అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. శుక్రవారం రాత్రి అన్ని జిల్లాల కలెక్టర్ తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుండమాల గ్రామానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడంతో ఇదే ఉత్సాహంతో మరిన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు