రాజమండ్రి సిటీ: దేవి చౌక్ అమ్మవారికి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రాజమండ్రి దేవికౌంట్లో అమ్మవారికి రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పూజలు చేశారు. సోమవారం ఉదయం శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ ఆమెను ఘనంగా స్వాగతించారు. దేశం మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ బాగుండాలని ఆమె పూజలు చేశారు. ఎంపీ ఉత్సవ కమిటీని అభినందించారు.