నంద్యాల అర్బన్: నంద్యాలలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Jun 5, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్రమంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల చెంతకే పాలనను తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు అస్సలు నిర్లక్ష్యం వహించకూడదని, అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడటమే తమ ప్రాధాన్యత అని తెలిపారు.