నంద్యాల అర్బన్: నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని పెద్దపులి మృతి
Nandyal Urban, Nandyal | May 25, 2026
నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని నల్లమల అడవి చలమ రైల్వే ట్రాక్ సమీపంలో రైలు ఢీకొని పెద్ద పులి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం అటవీ శాఖ అధికారుల వివరాలు మేరకు.. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో పులి మృతి చెందిందన్నారు. అటవిశాఖ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశామన్నారు.