బనగానపల్లె: పాణ్యం బనగానపల్లె రహదారిలోఆలమూరు వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
నంద్యాల జిల్లా పాణ్యం నుండి బనగానపల్లె రహదారిలో ఆలమూరు వద్ద ఆదివారం సాయంత్రం వేచిన ఈదురుగాళ్లకు ఓ చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది దీంతో బనగానపల్లె పాణ్యంల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో చెట్టును తొలగించారు. రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి