ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు : తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి స్పష్టం చేశారు, సోమవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను పోలీసు సిబ్బందితో కలిసి ఆమె తనిఖీలు చేశారు పెట్రోల్ బంకుల్లోని స్టాక్ రిజిస్టర్లను, స్టాకు ఆమె పరిశీలించారు, అనంతరం తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు పెట్రోల్ బంకులను పరిశీలించామన్నారు, ప్రజలు వాహనదారులు ఎవరు ఆందోళన చెడ్డవద్దని ఆమె తెలిపారు.