వైసీపీ వాళ్లు 2 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు: ఎమ్మెల్యే యరపతినేని
వైసీపీ నేతలు 2019-24 మధ్య గురజాల నియోజకవర్గంలో 2,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.మంగళవారం మాచవరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే 1,600 ఎకరాల ఆక్రమణపై ప్రాథమిక విచారణ పూర్తైందని, కొందరు ఈ భూమిని తాకట్టు పెట్టి రుణాలు కూడా పొందారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామని తెలిపారు.