నారాయణపేట్: పల్లె గడ్డ గ్రామస్తులకు దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి: సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డిమాండ్
నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని పల్లె గడ్డ గ్రామస్తులకు దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని కోరుతూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం 11 గంటల సమయంలో మరికల్ తాహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ పల్లె గడ్డ వాసులు 270, 271 సర్వే నంబర్ల లో ఇండ్లు కట్టుకొని అక్కడే పూర్వీకుల నుండి జీవనోపాధి కొనసాగిస్తున్నారని వారి వ్యవసాయ భూములు ఆ చుట్టుపక్కల గ్రామంలోననే ఉన్నాయని అన్నారు. దేవాదాయ శాఖ వారు ఆ గ్రామస్తులకు వచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరారు.