అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సౌమ్య అనే మహిళా ఉద్యోగిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం కలకాలం సృష్టించింది. గురువారం ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు రంపచోడవరం సిఐ సన్యాసినాయుడు తెలిపారు. సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళ ఉద్యోగిని కొందరు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకు వెళ్లినట్లు ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కిడ్నాప్ ఎందుకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు.