గుంతకల్లు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన మెప్మా ఆర్పీలు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ మెప్మా ఆర్పీలు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తింపు చేయాలన్నారు. అనంతరం కమిషనర్ జబ్బార్ మియా కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, పలువురు ఆర్పీలు పాల్గొన్నారు.