రామారెడ్డి: మద్దికుంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వుండటం గమనించారు.ప్రార్థన సమయానికి వెళ్లి ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, గ్రౌండ్ పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ...వారిని పలు ప్రశ్నలు అడిగారు. బాగా చదువుకొని తల్లి తండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.