అవుకు కంబగిరి స్వామి జాతరకు ప్రత్యేక బస్సులు బనగానపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ శశిభూషణ్
అవుకు కంబగిరి స్వామి జాతర సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు బనగానపల్లె డిపో మేనేజర్ శశిభూషణ్ తెలిపారు. వచ్చే నెల 1, 2వ తేదీల్లో అవుకు, కునుకుంట్ల, గార్లదిన్నె మార్గాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, అక్రమ వాహనాల్లో ఓవర్లోడ్తో ప్రయాణించవద్దని సూచించారు.