కావలి: ఎయిర్పోర్ట్ పనులు త్వరలో ప్రారంభం: స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు...
దగదర్తి విమానాశ్రయ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఆదివారం ఆయన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి దగదర్తి ఎయిర్పోర్ట్ భూములను పరిశీలించారు. కృష్ణబాబు మాట్లాడుతూ.. దగదర్తిలో సుమారు 1,370 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.