నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
Nandyal Urban, Nandyal | Jun 7, 2026
నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, మహానంది రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షంతో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలు కాస్త ఊరట లభించిందన్నారు.