నంద్యాల అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడాలని నంద్యాలలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
నంద్యాల బస్టాండ్ ఆవరణంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలు బాగుండాలని, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోనీ ప్రజాసేవలో పునరంకితం కావాలని, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి, జనసేన నాయకులు దొడ్ల సురేష్ చౌదరి, సింహాసనం నగేష్, నందిగళ్ళ సందీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో కుంకుమార్చన నిర్వహించి భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ దొడ్ల అనూష, దేశం గిరిబాబు ,పురుషోత్తం రెడ్డి, అబ్దుల్ భాష , లాయర్ శివ , శ