బెలుం గ్రామంలో పారిశుధ్య సమస్య
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామ ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య సమస్య జటిలమవుతోంది. ఏళ్ల తరబడి మురికినీరు రోడ్డుపైనే పారుతుండటంతో విద్యార్థులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక పనులతో మమ అనిపిస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆవేదన చెందుతూ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.