మామిళ్లపల్లి వడ్డేపల్లి టోల్ ప్లాజా వద్ద ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నేతలు
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి శుక్రవారం ఆరు గంటల సమయంలో కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మామిళ్లపల్లి వద్ద పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలకడం జరిగింది మంత్రి నారా లోకేష్ టిడిపి నేతలను కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వాళ్ళు ఇచ్చిన బొకేలను స్వీకరించడం జరిగింది. అనంతరం నేషనల్ హైవే మీదుగా కళ్యాణ్ దుర్గం పర్యటనకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తరలి వెళ్లడం జరిగింది. అదేవిధంగా వడ్డీపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా టిడిపి నేతలు నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.