కర్నూలు: బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు : నాగేశ్వరరావు యాదవ్
రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. కర్నూలులోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖం, బీసీ నాయకులు పాల్గొన్నారు.తెలంగాణలో బీసీలు పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించారని, అయితే కొందరు కుట్రలతో వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లను 26 శాతం నుంచి 34 శాతానికి పెంచారని చెప్పారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారం