పలమనేరు: కళ్యాణరేవు జలపాతంలో గల్లంతైన యూనిస్ మృతదేహం నాలుగు కిలోమీటర్ల కవతల లభ్యం,
పలమనేరు: పట్టణం పోలీస్ లైన్ వీధికి చెందిన యూనిస్ గత రెండు రోజుల ముందు తన స్నేహితులతో కలిసి కల్యాణరేవు జలపాతంలో సరదాగా ఈత కొట్టడానికి దూకి గల్లంతైన విషయం విధితమే. రెండు రోజులుగా యూనిస్ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది మరియు యూనిస్ బంధువులు స్నేహితులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాహసోపేతంగా వెతకగా, యూనిస్ మునిగిన చోటు నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల కు అవతల మృతదేహం లభ్యమైంది. దీంతో అతని కుటుంబీకులు స్నేహితులు రోదనలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో, మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ మరియు మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి తదితరులు పాల్గొన్నారు.