బనగానపల్లె: సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం: బనగానపల్లె సబ్ రిజిస్టర్ అనిల్ కుమార్
సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బనగానపల్లె సబ్ రిజిస్ట్రార్ వి. అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని అభివృద్ధి పనులు, ఇతర వివరాలను ఈ చట్టం ద్వారా సులభంగా పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడి నాగేశ్ బాబు, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.