ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిలిపించిన కారును గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అపహరించి తీసుకువెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియాలో ఈ కారు ఫోటోలు పోస్ట్ చేసి ఎవరైనా ఈ కారును గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కంభం పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.