ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో సుబ్బారావు అనే వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి, సుబ్బారావుకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం సుబ్బారావు అనే వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడ్డ సుబ్బారావును అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే సుబ్బారావు పై ఎందుకు దాడి జరిగిందో విచారణలు తెలియవలసి ఉందని పోలీసులు అన్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.