నందికోట్కూరు: పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ఎరువు ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోకో
నంద్యాల జిల్లా నందికొట్కూరు పెంచిన పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్, ఎరువుల ధరలు తగ్గించకపోతే భారత్ బంద్ చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. మంగళవారం నందికొట్కూరులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే గంటపాటు రాస్తారోక్ నిర్వహించారుఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు ఎం నాగేశ్వరరావు,వి. రఘురాంమూర్తి, వై నరసింహులు, పి.వెంకటేశ్వర్లు, అల్లప్ప, కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ,ఎరువుల ధరలు భారీగా పెంచి ప్రజలకు వాత