మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నారని తీవ్రంగా విమర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా
Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లాలో నీటి కొరతైన ఉందేమో కానీ మద్యం కొరత ఏమాత్రం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. సోమవారం సోషల్ మీడియా ద్వారా ఎక్సైజ్ అధికారులపై సైదా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్ డ్రింక్ షాపుల కూడా ఆఖరికి మద్యం బార్లుగా మారాయని ఎద్దేవా చేశారు. మద్యం బెల్టు షాపులు గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా సాగుతున్నాయని మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నట్లు విమర్శించారు.