ఒంగోలు అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులకు కృషి తప్పనిసరి, గతంలో కన్నా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి: కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 19, 2026
రోడ్డు ప్రమాదల నివారణకు అధికారుల కృషి తప్పనిసరి అని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. 2024 అత్యధికంగా రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే 2026 సంవత్సరానికి వచ్చేసరికి 30% రోడ్డు యాక్సిడెంట్ తగ్గినట్లు తెలిపారు. అధికారులు అందరూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించి ప్రమాదాలు నివారించాలని సూచించినట్లు వెల్లడించారు.