అనంతపురంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు సురక్ష యాప్ స్కానర్ కోడ్ ను ఆవిష్కరించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో గురువారం ఒంటిగంట పదినిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఎక్స్చేంజ్ సురక్ష ఆప్ స్కానర్ కోడ్ ను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించిన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సురక్ష యాప్ స్కానర్ కోడ్ ను ప్రారంభిస్తున్నామని మద్యం కొనుగోలు చేసి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలు వస్తే మద్యం మంచిదని వివరాలు రాకుంటే కల్తీ మద్యం గా తేలితే ఫిర్యాదు కూడా చేయవచ్చునని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.