చెన్నూరు: పెయింట్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెయింటింగ్ కార్మిక నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు మంగళవారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అద్యక్షులు బత్తుల మీనయ్య, ప్రధాన కార్యదర్శి కందుల శ్రీకాంత్, కోశాధికారి గోరంట్ల వెంకటస్వామి, సహాయకార్యదర్శి రవి, దేవేందర్, ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, ఎన్నికయ్యారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం సబ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోనీ పెయింటింగ్ కార్మికులు పాల్గొన్నారు.