నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలోని పలు గ్రామాలలో గడిచిన 5 రోజుల నుంచి రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మండల వాసులు గజగజ వణుకుతున్నారు. రాత్రి, పగలు సైతం ఒకేలా చలి ప్రభావం ఉండగా, మధ్యాహ్నం కాస్త తగ్గుతుంది. ఉదయం 9 గంటలైనా మంచు, చలి వీడవడం లేదని ప్రజలు వాపోతున్నారు.