ఎస్సీ, బీసీలకు 50 వేల సాయం – ఎస్టీలకు 75 వేల ప్రత్యేక మంజూరు:రాష్ట్ర హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి
రాష్ట్ర హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రదాతగా నిరూపించుకున్నారని అన్నారు. రాత్రింబగళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించిందని మంత్రి పేర్కొన్నారు. కేవలం 16 నెలల్లోనే 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం ఈ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. త్వరలో మరో 6 లక్షల ఇళ్లు పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు.పేదల ఇల్లు నిర్మాణానికి ఎస్సీలు, బీసీలకు రూ.50 వేల చొప్పున, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున, గిరిజనుల